మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:23:48

ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చూడాలి

ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చూడాలి

అయిజ : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ మేరకు తాసిల్దార్‌ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రై తుల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తు న్న నిధులను బ్యాంకర్లు చెల్లించకుండా అప్పుల కింద జమ చేసుకంటున్నారని తెలిపారు. రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు పంటలు చేతికందకముందే ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను జమ చేసుకొని రైతులకు ఉట్టి చేతులతో పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆసరా పింఛన్లు, చేనేత కార్మికుల త్రిఫ్టు ఫండ్‌ తదితర అన్ని రకాల ప్రభుత్వ పథకాల సొమ్మును ఖాతాదారులకు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షేక్షావలి ఆచారి, దేవరాజు, మాధన్న, ఆంజనేయులు, విజయభాస్కర్‌రెడ్డి, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.