మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:23:48

వాల్మీకి భవన నిర్మాణానికి భూమిపూజ

వాల్మీకి భవన నిర్మాణానికి భూమిపూజ

కొత్తకోట : మండలంలోని పాలెం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించనున్న వాల్మీకి భవన నిర్మాణానికి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, సింగిల్‌విండో చైర్మన్‌ వంశీదర్‌రెడ్డిలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మాట్లాడు తూ ఎంపీపీ, జెడ్పీ నిధుల నుంచి పాలెం గ్రామంలో వాల్మీకి భవనాన్ని నిర్మించనున్నట్లు, నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాధా రామకృష్ణరెడ్డి, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, ఎంపీటీసీ నర్సయ్య, నాయకులు మోహన్‌కుమార్‌, అలీం, బాలయ్య, మన్నెంకొండ, సత్యం, భాస్కర్‌, యాదయ్యసాగర్‌, వికాస్‌, విష్ణు పాల్గొన్నారు.