ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:23:46

అందుబాటులో ఎరువులు

అందుబాటులో ఎరువులు

వనపర్తి రూరల్‌ : మండలంలోని వ్యవసాయ సహకార సంఘాలలో రైతులకు వానకాలం పంటలకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి కురుమయ్య గురువారం  ప్రకటనలో తెలిపారు. వనపర్తి బాలనగర్‌, రాజనగరంలోని వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌లను తీసుకొని ఎరువులను తీసుకొవాలని సూచించారు.