సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:23:46

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

  • l విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించాలి
  • l ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • l కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

కొత్తకోట : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం ఆమె కొత్తకోట మండలంలోని అప్పరాల గ్రామ సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో స్థానిక నాయకులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎం తో ముఖ్యమని, చెట్ల పెంపకంతోనే వర్షా లు విరివిగా పడడంతోపాటు పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. అందుకు గ్రామాలు, పట్టణాలలో విస్తృతంగా మొక్కలు నాటాలని చెప్పారు. నా టిన మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రా మాల్లో సర్పంచులదని, మున్సిపాలిటీలో చైర్‌ పర్సన్‌లదేనని పేర్కొన్నారు. జిల్లాలోని ఫ్యాక్టరీల యాజమాన్యాలు ముందుకు వచ్చి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునివ్వాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎం పీపీ గుంతమౌనిక, డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ వంశీదర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాక బాలనారాయణ, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, నాయకులు శ్రీను, సు భాష్‌, వినోద్‌సాగర్‌, ఎంపీవో సుదర్శన్‌, ఫ్యాక్టరీ యాజమాన్యం పాల్గొన్నారు.