మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 10, 2020 , 02:32:14

ప‌ల్లె ప్ర‌గ‌తికి ప‌ది సూత్రాలు

ప‌ల్లె ప్ర‌గ‌తికి ప‌ది సూత్రాలు

వనపర్తి రూరల్‌ : గ్రామాల స్థితిగతులు మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాలను పచ్చదనం, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాలను అద్దంలా మెరువాలంటే పల్లె ప్రగతికి పది పథకాలు అసరమని ప్రాథమికంగా గుర్తించారు. వాటిని పూర్తి చేయాలని నిర్ధేశించి వచ్చే ఈ ఏడాది ఆగస్టు 9లోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించింది. 10 నుంచి 13వ తేదీ వరకు విజిలెన్సు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. గడువు సమీపిస్తుండటంతో గ్రామాల్లో పది ప్రణాళిక కార్యక్రమాల కార్యాచరణలు వేగవంతంగా ఓ దిశకు వస్తున్నాయి. వాటిలో మొదటి పల్లె ప్రగతి కార్యక్రమంలోనే మొట్టమొదటి కార్యక్రమ పారిశుధ్య, శిథిల, పురాతన ఇళ్లు, ముళ్ల పొదలు తొలగింపు, మురుగునీటి గుంతల పూడ్చివేత, ఎల్‌ఈడీ వీధి లైటు వంటి  నిర్వహణ విజయవంతం కావడంతో గ్రామాలో ప్రగతి కనిపించింది. గ్రామాల్లో ప్రజలు ఆహ్లాదరకరమైన వాతావరణంలో సేద తీరేందుకు ప్రకృతి వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇలా సీఎం కేసీఆర్‌ మదిలో వెలసిన పది గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు పల్లె ప్రగతి కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. 

గ్రామాలలో పారిశుధ్య ప్రణాళిక

పల్లె ప్రగతి ముఖ్యమైన ఉద్దేశం గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, దాంతో పాటు చెత్త సేకరణ, ప్రజలకు అందిస్తున్న మిషన్‌ భగీరథ నుంచి సురక్షిత నీరు అందించడం, దోమలు, అంటువ్యాధుల నియంత్రణ, మురుగు కాల్వల శుభ్రం చేయించడం. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి కార్యక్రమాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించేలా చేపట్టాడం.వీటి కోసం గ్రామ జనాభా బట్టి గ్రామ పంచాయితీకి రూ.1.60 లక్షల చొప్పున నిధులు తెలంగాణ ప్రభుత్వం 

కేటాయిస్తుంది.

ముళ్ల పొదల తొలగింపు, నీటి గుంతల పూడ్చివేత

గ్రామాల్లో ఏండ్లుగా పాడుబడిన పురాతన భవనాలు, శిథిలలను తొలిగించడం, వీధుల్లో మురికి నీటి గుంతలను పూడ్చివేయడం వంటి కార్యక్రమాలను ఈ ప్రణాళికలో చేపట్టారు. ముఖ్యంగా దీని ఉద్దేశం పురాతన పాడుపడిన భవనాలు, పొదలలో విషకీటకాలకు నిలయంగా మారుతుండం, అలాగే ఎప్పుడు ఆవి కూలి ఎవరికీ ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి గ్రామాల్లో ఉండేంది. ఈ పరిస్థితిని మార్చేందుకే గ్రామాలోని భవనాలు, పొదలు తొలిగిస్తే విష కీటకాల స్థావరాలు తొలిగించినట్లే. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వతో దోమలు, వాటి ద్వారా విష జ్వరాలు ప్రభలకుండా ప్రజారోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుండు గుంతలు

గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడానికి, అలాగే అంటువ్యాదులకు మూలంగా ఇంటింటికి మరుగుదొడ్డి లేక పోవడం. గ్రామాలలో బహిరంగ మలవిసర్జన ప్రధానకారణాలు. గ్రామాలలో మురికి కాల్వలు లేక మురుగు రోడ్లు మీదికి రావడం కూడా ఓ కారణం,వీటిన్నింటి పరిష్కారం చూపేందుకు గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుండు గుంతల ఏర్పాటుతో వ్యర్థ నీటిని భూమిలోకి ఇంకించి మురుగును నివారించడంతో పాటు భూగర్భ జలాలు పెంచవచ్చు.వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో అపరిశుభ్రత వాతావరణం నుంచి కాపాడుకోవచ్చు. ప్రతి ఇంటిలో ఇంకుండు గుంతను నిర్మించుకోనేందుకు ప్రభుత్వం రూ.4260, వ్యక్తిగత మరుగు దొడ్డికి రూ.12 వేలు అందిస్తుంది.

వర్మి కంపోస్టు

గ్రామాల్లో ప్రధానంగా వేధించే సమస్య ఘన వ్యర్థాల నిర్వహణ. వీధులు, ఖాళీ ప్రదేశాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. అంటు వ్యాధులకు ఇదే ప్రధాన కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని భావించి వర్మీ కంపోస్టు తయారు చేసి రైతులకు విక్రయించనున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరనున్నది. వర్మీ కంపోస్టు రూ. 2.50 లక్షలు, డంపింగ్‌ యార్డు నిర్మాణం కోసం రూ.1.56 లక్షల నిధులు విడుదల చేసింది.

జిల్లాలో 252 సెగ్రిగేషన్లకు గానూ మూడు మోడల్‌ గ్రామాల ఎంపికలో   చిన్నమందడి, గోపాల్‌పేట మండలం తాడిపర్తిలో, వనపర్తి మండలం నాచహాళ్లి రూ.3 లక్షలతో వాటిని నిర్మించారు. మిగతా 249ని రూ.2.5 లక్షలతో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో ఇప్పటి వరకు 16కు పైగా పూర్తి నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. 

ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్లు కొనుగోలు

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్యక్రమాలలో భాగంగా చెత్తను సేకరించడం, డంపింగ్‌యార్డులకు వాటిని తరలించడం, హరితహారం మొక్కలకు నీళ్లు పట్టడం,నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీరందించడం వంటి తదితర అవసరాలకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లు అవసరంగా ఉంటాయన్న ఆలోచనతో ప్రతి గ్రామ పంచాయతీకి వీటిని గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేయించారు.

పంచాయతీకో నర్సరీతో హరితహారం

గ్రామాలను హరితవనాలుగా మార్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో అటవీ విస్తీర్ణంతో ప్రతి

 ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలు నాటించేలా కార్యాచరణ చేపట్టారు. హరితహారం ద్వారా పల్లెల్లోనూ పచ్చదనం పరిఢవిల్లాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీలో నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను బతికించాలని బాధ్యతను సర్పంచ్‌, కార్యదర్శులు వహించాలని నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో నిర్ధేశించారు. రహదారులకు ఇరువైపులా భారీ ఎత్తున్న మొక్కలు నాటేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 47 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటికే 

70 శాతం పూర్తయ్యింది.


logo