ఆదివారం 06 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 10, 2020 , 01:41:29

నేను మీ ప్రతినిధిని..

నేను మీ ప్రతినిధిని..

  • పనిచేసే వారికే ప్రజల ఆశీస్సులు 
  • దేశంలోనే వనపర్తి వేరుశనగకు రికార్డు
  • మార్కెట్‌ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి రూరల్‌ : మీరు నాకిచ్చిన అవకాశంతో మీకోసం పనిచేస్తున్నా.. నేను మీ ప్రతినిధిని అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. అంతకుముందు కా ర్యాలయంలోని చాంబర్‌లో మార్కెట్‌ చైర్మన్‌ను  మం త్రి నిరంజన్‌రెడ్డి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్ర జల కోసం నిరంతరం పనిచేసే వారికి వారి ఆశీస్సులు ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలబడి వారికి లాభాసాటి వ్యాపార మార్గాలను సూచించాల్సిన బాధ్యత నూతన పాలక మండలిపై ఉందన్నారు. సాగునీటి రాకతో ఈ ప్రాంతంలో పంటల సాగు పెరిగిందన్నారు. వ్యవసాయ పనులు పెరగడంతో కూలీల కొరత ఏర్పడిందని, ప్రతి గ్రామంలోని రైతులు, కూలీలు, కుల వృత్తులు వారు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఏర్పడిందన్నారు. ప్ర జలకు బతుకు దెరువు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సాగునీళ్లు ఇచ్చాకే నామినేషన్‌ వేశానని గుర్తు చేశారు.

ఇప్పడు దాదాపుగా అన్ని గ్రామాలు, తండాలకు నీళ్లిచ్చేందుకు శ్రమిస్తున్నానని, ఇందుకోసం గ్రామాల్లోని ఏ నాయకుడిని నిద్రపోనివ్వన్నారు. కర్నెతండా లిఫ్ట్‌, వనపర్తిలో కిష్టంపురంలో రిజ్వరాయిర్‌ ఏర్పాటు చేసి కాశీంనగర్‌ నీటి సమస్యను తొలిగిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి కేంద్రాలకు ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు శ్రీకారం చుట్టనున్నదని తెలిపారు. దేశంలోనే వనపర్తి వేరుశనగకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. పెద్దమందడి మండలం వీరాయిపల్లి శివారులో వ్యవసాయ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. అనంతరం నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆశీస్సులతో రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో పలు ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. మార్కెట్‌, రైతుల అభ్యున్నతికి పాటుపడుతానన్నారు. జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నిబద్ధతో పనిచేసే వారికి మంత్రి ఆశీస్సులతో తప్పక స్థానం లభిస్తుందన్నారు. ఆయన ఆలోచన ముందు తరాలకు ఉపయోగపడేలా ఉంటుందన్నారు. అనంతరం మంత్రి, నూతన చైర్మన్‌ను పలువురు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జెడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, సామ్యనాయక్‌, ఎంపీటీసీ మెగారెడ్డి, గొ ర్రెల కాపరుల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ డేగ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిల ర్లు వెంకటేశ్‌, రైతుబంధు సమితి కన్వీనర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు