శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Aug 09, 2020 , 04:04:23

మొక్క‌లు నాటాలి

మొక్క‌లు నాటాలి

 ఖిల్లాఘణపురం : పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు గ్రామా ల్లో పార్కులను ఏర్పాటు చేసి ప్రతి పార్కులో మొక్కలు నాటి సంరక్షించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో కోదండరాం అన్నారు. శనివారం మండలంలోని రోడ్డుమీదితండా, సల్కలాపూర్‌, మల్కినియాన్‌పల్లి, అల్లమాయిపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పార్కుల ఏర్పాటుతో పార్కుకు ఇరువైపులా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.