సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Aug 09, 2020 , 04:04:21

మార్కెట్‌ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ సభా స్థలం పరిశీలన

మార్కెట్‌ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ సభా స్థలం పరిశీలన

వనపర్తి రూరల్‌ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ నూతన కమిటీ  ప్రమాణ స్వీకారోత్సవ సభా స్థలాన్ని శనివారం నూతన చైర్మన్‌ లక్ష్మారెడ్డి సభ్యులతో కలిసి మార్కెట్‌ యార్డులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆశీస్సులతో మార్కెట్‌ కమిటీ ఏర్పాటైందని,  ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకోసం ఏర్పాట్లను సభ్యులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ తదితర ముఖ్యులు కొద్దిమంది మాత్రమే హాజరుకానున్నారని, కరోనా పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అభిమానులు, కార్యకర్తలు నియమ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కోరారు. కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, మార్కెట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.