గురువారం 01 అక్టోబర్ 2020
Wanaparthy - Aug 07, 2020 , 04:42:11

రుణాలపై దృష్టి కేంద్రీకరించాలి

రుణాలపై దృష్టి కేంద్రీకరించాలి

l ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

వనపర్తి : ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద ఇచ్చే రుణాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, లీడ్‌ బ్యాంకు మేనేజర్లతో ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద ఇచ్చే రుణాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల రుణాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వీధి వ్యాపారికి రు ణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కనీసం 5శాతం వీధి వ్యాపారులకు 100 శాతం రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో వీధి వ్యాపారులు ప్రైవేటు వ్యాపారుల ద్వారా రోజు వారీ వడ్డీకి అప్పు తీసుకుని ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారని,  ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా వీధి వ్యాపారులందరికీ వంద శాతం రుణాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్లు బ్యాంకు అధికారులతో రెగ్యూలర్‌గా సమావేశాలు నిర్వహించాలని, ఎల్‌బీఎంతో పాటు జిల్లా పరిశ్రమల మేనేజర్లను పిలిపించి ప్రతి వారం సమీక్షించాలని ఆదేశించారు. కార్యక్రమం లో కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్‌ శ్రీవాత్సవ పాల్గొన్నారు. logo