గురువారం 01 అక్టోబర్ 2020
Wanaparthy - Aug 07, 2020 , 04:42:11

ఆగస్టు చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ఆగస్టు చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలి

  • l రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

వనపర్తి : ఆగస్టు చివరి నాటికి హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌ నుంచి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీల్లో అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ పార్కులను చేయాలని, మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, హరితహారం కోసం జిల్లాలో

అవసరమైన ఉపాధిహామీ నిధులను ఉపయోగించాలని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ తప్పనిసరిగా చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరో విడుత హరితహారం కింద 29.86 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యం కాగా ఇంతవరకు 19.55 కోట్ల మొక్కలు పెంపకం జరిగిందని, మిగిలిన లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మంత్రి సూచించారు. ఇంతవరకు 14.5కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, 5.04 కోట్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని, నాటిన మొక్కల్లో 5.7 కోట్ల మొక్కలకు మాత్రమే జియో ట్యాగింగ్‌ పూర్తి చేశామని, జియో ట్యాగింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి, మున్సిపాలిటీలకు 70 శాతం లక్ష్యాలను కేటాయించామని పేర్కొన్నారు. వీసీలో కలెక్టర్‌  షేక్‌ యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్‌ శ్రీవాత్సవ, జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు పాల్గొన్నారు. 


logo