మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 07, 2020 , 04:33:30

అరగ్రాము వెండితో రాఖీ, శివలింగాల తయారీ

అరగ్రాము వెండితో రాఖీ, శివలింగాల తయారీ

  • n   సూక్ష్మ వస్తువులను బ్రహ్మకుమారీస్‌కు బహూకరించిన శేఖరాచారి

కల్వకుర్తి రూరల్‌ : నాగర్‌కుర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని ప్రజాపిత బ్రహ్మకుమారీ రాజయోగ కేంద్ర నిర్వాహకులకు గురువారం పట్టణానికి చెందిన శేఖరాచారి  అర గ్రాము వెండితో తయారు చేసిన రాఖీ, శివలింగాలను బహూకరించాడు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తక్కువ బరువుతో కూడిన వెండి రాఖీ, శివలింగం, ఓంకారాన్ని నాలుగు గంటలపాటు శ్రమించి తయారు చేసినట్లు ఆయన తెలిపాడు. బ్రహ్మకుమారీస్‌ నిర్వాహకులు విజయ,  వివేకానంద, కృష్ణయ్యలకు అందించాడు. శేఖరాచారిని పలువురు అభినందించారు.