సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Aug 06, 2020 , 02:44:15

తల్లిపాలే బిడ్డకు అమృతధార... కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

తల్లిపాలే బిడ్డకు అమృతధార... కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి : ఆరు నెలలపాటు బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని , తల్లిపాలే బిడ్డకు అమృతధారయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధి త అధికారులతో కలిసి ఆమె బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి గంటలోపు ముర్రుపాలు పట్టాలని, ఈ పాలతో పుష్కలంగా పోషకాలు లభిస్తాయని, బిడ్డకు పాలు ఇవ్వటంతో తల్లి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందన్నారు. కరోనా వైరస్‌ విపత్తు సమయంలో అంగన్‌వాడీ సెంటర్‌ ద్వారా లబ్ధిదారులందరికీ టేక్‌ హోమ్‌ రేషన్‌ విధానంలో ఇంటింటికీ అంగన్‌వాడీ టీచర్లు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, జిల్లా మాతా శిశు సంక్షేమాధికారి నర్సయ్య తదితరులు ఉన్నారు.