ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Aug 05, 2020 , 02:47:38

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

 వనపర్తి క్రైం : కరోనాపై పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాబోయే రెండు మూడు నెలల్లో కొవిడ్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో కరోనా బారిన పడకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కరోనా పోరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతూ తమ కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేశారు. కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, ఎస్సై జమ్ములప్ప, ఐటీసెల్‌ సిబ్బంది గోవిందు, మురళీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.