మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 03, 2020 , 03:47:41

248 మంది హోం క్వారంటైన్‌

248 మంది హోం క్వారంటైన్‌

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని మార్చాలలోని సత్యసాయినగర్‌(కాటన్‌ మిల్లు)వద్ద 248మందిని తోటపల్లి పీహెచ్‌సీ వైద్యసిబ్బంది హోం క్వారంటైన్‌ చేశారు. శనివారం వైద్యాధికారులు విడుదల చేసిన జాబితాలో కాటన్‌ మిల్లుకు చెందిన 12మందికి కరోనా పాజిటివ్‌ తేలడంతో వైద్య సిబ్బంది వారితో ప్రైమరీ కాంటాక్ట్స్‌లో ఉన్న 248 మందిని గుర్తించి వారిని హోం క్వారంటైన్‌ చేశారు. అనంతరం వారికి మందులు, మాస్కులు, వైద్య సలహాలు, సూచనలు చేశారు.


logo