ఆదివారం 09 ఆగస్టు 2020
Wanaparthy - Aug 02, 2020 , 07:21:01

‘గ్రామాభివృద్ధి కోసం కలిసి ముందుకు వెళ్దాం’

‘గ్రామాభివృద్ధి కోసం కలిసి ముందుకు వెళ్దాం’

వనపర్తి రూరల్‌ : గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతి వార్డు సభ్యుడు కలిసి ముందుకు రావాలని సర్పంచ్‌ భానుప్రకాశ్‌ కోరారు. శనివారం చిట్యాల గ్రామ పంచాయతీలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో జరిగే అభివృద్ధిలో ప్రతి వార్డు సభ్యుడు బాధ్యుడు కావాలని సూచించారు. గ్రామంలో మిగిలిపోయిన కమిటీహాల్స్‌ పూర్తి చేసుకొనేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని వాటిని పూర్తి చేసుకొనేందుకు అందరం కృషి చేద్దామన్నారు. గ్రామ పంచాయతీకి హరితహారం లక్ష్యంగా 25 వేల మొక్కలకు గానూ ఇప్పటికి 80 శాతం నాటించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నరసింహ, ఎంపీటీసీ రాజేశ్వరి, కార్యదర్శి రాధ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo