మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 02, 2020 , 07:21:01

ఇంటింటా వైద్య పరీక్షలు

ఇంటింటా వైద్య పరీక్షలు

వనపర్తి రూరల్‌/ఆత్మకూరు/పాన్‌గల్‌ : వనపర్తి మండలం కడుకుంట్ల గ్రా మంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యుడు రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 13 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపా రు. ఆత్మకూరు, అమరచిం త మండలాల్లో శనివారం కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఉమ్మడి మండలంలో మొత్తం 19 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వారికి మందులను పంపిణీ చేసి హోంక్వారంటెన్‌లో ఉండాలని సూ చించారు. పాన్‌గల్‌ మండలం శాగాపూర్‌ గ్రామం లో కరోనా ప్రైమరీ కాంట్రాక్ట్స్‌ గుర్తించేందుకు శనివారం వైద్య బృందం ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు మహేశ్వరాచారి, వైద్యాధికారులు లక్ష్మ ణ్‌, అక్షయ్‌కుమార్‌, సిబ్బంది సురేందర్‌గౌడ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనివాస్‌లు, ఏఎన్‌ఎంలు సుమిత్ర, రమాదేవి, సుధారాణి పాల్గొన్నారు.