మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Aug 01, 2020 , 08:28:38

మున్సిపల్‌ అధికారికి వినతి

మున్సిపల్‌ అధికారికి వినతి

వనపర్తి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు కరోనా కిట్లు, శానిటైజర్లను అందించాలని సీపీఎం నాయకుడు ఎండీ జబ్బార్‌ కోరారు. శుక్రవారం ప్రజలు, కార్మికుల సమస్యలపై మున్సిపల్‌ సహాయ మేనేజర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ జబ్బార్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో  రోడ్ల విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఇప్పించాలని వినతిలో కోరినట్లు చెప్పారు. కార్మికులకు కరోనా కిట్లు, శానిటైజర్లను అందించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగేశ్వర్‌, కురుమయ్య, మండ్లరాజు ఉన్నారు