శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 01, 2020 , 08:26:57

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

l జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి

వనపర్తి వైద్యం : రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం దాచలక్ష్మయ్య ఫంక్షన్‌ హాల్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జెడ్పీ చైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడానికి యువత ముందుకురావాలని పేర్కొన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సారి రక్తదానం చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ఖాజాకుతుబొద్దీన్‌, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, రెడ్‌క్రాస్‌ మెంబర్‌ చిన్నమ్మ థామస్‌ పాల్గొన్నారు.