సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jul 29, 2020 , 03:11:02

ఏడాదిలోగా రోడ్ల విస్తరణ పూర్తి

ఏడాదిలోగా రోడ్ల విస్తరణ పూర్తి

వనపర్తి: వనపర్తి పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులన్నీ ఏడాదిలో పూర్తి కావాలని  వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులతో మంత్రి ముచ్చటించారు. అంతకుముందు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి  నామినేషన్లు వేసిన గులాంఖాదర్‌, ఇమ్రాన్‌, ఖైరూన్‌, పద్మలకు మంత్రి స్వీట్‌ తినిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల సహకారంతోనే రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, కౌన్సిలర్ల పాత్ర ప్రశంసనీమన్నారు. విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు వచ్చేలా సంబంధిత కౌన్సిలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. 

ముస్లింలపై తనకు ఉన్న ప్రేమను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మరోసారి చాటారని టీఆర్‌ఎస్‌ నాయకులు షేక్‌ జాహంగీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు ముస్లిం అభ్యర్థులకు వనపర్తి మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ పదవులు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయా కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, పుట్టపాకుల మహేశ్‌, కంచెరవి,  చీర్ల సత్యం, విభూతినారాయణ, నాగన్నయాదవ్‌, వెంకటేశ్‌, బాష్యానాయక్‌, రాధాకృష్ణ, సమద్‌, ఉన్నీసాబేగం,  మంజుల, నందిమల్ల భువనేశ్వరి, కౌన్సిల్‌ సభ్యులు, జిల్లా మీడియా సెల్‌ కన్వీనర్‌ నందిమల్ల శ్యాం, జిల్లా సమన్వయకర్త రంగినేని అభిలాష్‌, నాయకులు తిరుమల్‌, మున్సిపాలిటీ అధికారులు తదితరులు ఉన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎం సహాయనిధిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 21మందికి రూ.6లక్షల13వేల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పెబ్బేరు రూరల్‌: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి పెబ్బేరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. శ్రీరంగాపురం, కంబాళాపురం, వెంకటాపురం, జానంపేట, పాతపల్లి, అయ్యవారిపల్లె, తిప్పాయిపల్లె, యాపర్ల, సూగూరు, తోమాలపల్లె, శాఖాపూర్‌ గ్రామాల్లో 20వెనుకబడిన తరగతుల కులాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు భూమిపూజలు, పలుచోట్ల ప్రారంభోత్సవాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికై తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్క కులాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు వేణుగోపాల్‌, శ్రీరంగాపురం ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌,  పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటిపద్మ, రెండు మండలాల సింగిల్‌ విండో అధ్యక్షులు జగన్నాథం, కోదండరామిరెడ్డి,  నాయకులు గౌనిబుచ్చారెడ్డి, వనంరాములు, గౌడానాయక్‌, పృధ్వీరాజు, గోవిందునాయుడు తదితరులు పాల్గొన్నారు.