ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 28, 2020 , 04:39:54

ఆగస్టు 7, 8న దేశ వ్యాప్త సమ్మె

ఆగస్టు 7, 8న దేశ వ్యాప్త సమ్మె

వనపర్తి : కొవిడ్‌ 19ను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తు న్న స్కీం వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంట నే పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 7, 8వ తేదీన అఖిల భారత సమ్మె, 9వ తేదీన సత్యాగ్రహం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తెలిపారు. సోమవారం తెలంగాణ అంగన్‌వాడీ యూనియన్‌ వర్క ర్స్‌ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సయ్యను మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రా న్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షు డు కవిత, జిల్లా కార్యదర్శి పద్మ ఉన్నారు.