బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 28, 2020 , 04:31:54

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

వనపర్తి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన చిరు వ్యాపారాలు చేసే వారికి వాసవి సేవా సమితి జిల్లా మహిళా కార్యదర్శి దివ్యశ్రీ మాస్కులు, శానిటైజర్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, సోడా బండి, ఇతర చిరు వ్యాపారాలు చేసే వారికి మాస్కులు, శానిటైజర్‌ అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.

నేడు అవగాహన సదస్సు

వనపర్తి వైద్యం : జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌, డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గ్రాండ్‌ సితారా హోటల్‌లో కొవిడ్‌ 19పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు హాజరుకావాలని కోరారు.