మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jul 28, 2020 , 04:31:54

ఎస్పీ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

ఎస్పీ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

వనపర్తి క్రైం : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల్లో ఏడు భూఫిర్యాదులు, మూడు భార్యాభర్తల గొడవలు, రెండు పరస్పర గొడవల ఫిర్యాదులు వచ్చాయని ఆమె చెప్పారు.