ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 28, 2020 , 04:31:54

హరితహారంలో నిర్ల‌క్ష్యం

హరితహారంలో   నిర్ల‌క్ష్యం

  • సమాచారం లేకుండానే అధికారుల ఇష్టారాజ్యం
  • l  అఖిల పక్షాలు ప్రత్యామ్నాయ స్థలం చూపాలి
  • l  పలు అంశాలకు ఏకగ్రీవ తీర్మానం
  • l  మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ 

వనపర్తి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడం లో వనపర్తి మున్సిపాలిటీ వార్డు ఇన్‌చార్జి అధికారులు నిర్లక్ష్యం వ హిస్తున్నారని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ మండిపడ్డా రు. హరితహారం కార్యక్రమంపై మున్సిపల్‌ అధికారులు ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణంగా ఉందన్నా రు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందు కు గానూ ప్రణాళిక సిద్ధం చేసుకునే సమయంలో కనిపించి న వార్డు ఇన్‌చార్జి అధికారులు నేటికీ వార్డుల్లో స్థానిక కౌన్సి ల్‌ సభ్యులకు దర్శనం ఇవ్వడం లేదంటే వారి పనితీరు ఏ స్థా యిలో ఉందో కంటికి కనిపిస్తుందని ఆయన ఆగ్రహాన్ని వ్య క్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలి టీ కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుల అత్యవసర సమావేశాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అధ్యక్షతన, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కౌన్సిల్‌ సభ్యులు సమద్‌ మాట్లాడుతూ వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారిని మున్సిపల్‌ అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు చైర్మన్‌ సమాధానమిస్తూ రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారి కోసం మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నా రు. ప్రతి బాధితుడికి న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కౌన్సిల్‌ సభ్యులు సత్యంసాగర్‌ మా ట్లాడుతూ హరితహారం కార్యక్రమం చేయడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, పలుమార్లు అడిగినా ఎటువంటి స్పందన వార్డు ఇన్‌చార్జి అధికారుల నుంచి రావడంలేదని, కేవలం తన వా ర్డులో 30 గుంతలను మాత్రమే తీయడం జరిగిందని, ప్ర భుత్వం నిర్వహించే కార్యక్రమంలో తమకు సమాచారం ఇవ్వకుండా ఉండడానికి గల వెనుక కారణం ఏమిటో పూర్తి గా తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. ఇందుకు స్పంది ంచిన మున్సిపల్‌ కమిషనర్‌ వార్డు ఇన్‌చార్జిలు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే విషయంపై వివరణ తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులకు గానూ ఏర్పాటు చేసిన వార్డు ఇన్‌చార్జి అధికారులతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, గతంలో కూడా వార్డు ఇన్‌చార్జిలు తమ ఇష్టారితీగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వకుండా చేయడానికి ప్రస్తుతం ప్రత్యేక పాలనాధికారి పాలన జరగడంలేదని, మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు ప్రజలతో ఎన్నుకోబడి పాలనను నిర్వహిస్తున్నారని ఈ విషయాన్ని  అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని హితువు పలికారు. అనంతరం కౌన్సిల్‌ సభ్యురాలు మంజుల మాట్లాడుతూ తమ వార్డులో నూతన డ్రైనేజీలు లేక మురుగునీరు ఇండ్ల ముందు నిలుస్తున్నాయని అన్నారు. స్పందించిన చైర్మన్‌ మాట్లాడుతూ డ్రైనేజీల కోసం రూ.3.30లక్షల నిధులు కేటాయించమని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు రాధాకృష్ణ ఎన్‌టీఆర్‌ లలితా కళాతోరణం వద్ద పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించరాదని చైర్మన్‌ దృష్టికి తీసుకురాగా అందుకు ఆయన మాట్లాడుతూ మీరు చెప్పినట్లే అక్కడ పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించకుండా ఉండేందుకు మీరు ప్రత్యామ్నాయ స్థలం చూయించాలని, ప్రధాన చౌరస్తా కావడం వల్ల అక్కడ ప్రజలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. అంతకు ముందు నాలుగు అంశాలపై కౌన్సిల్‌ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్స్‌, పట్టణ ప్రగతికి మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఆర్‌ నెంబర్‌ 89, తేదీ 19-06-2020 ద్వారా ఆమోదం పొందడంమైనది. కానీ పట్టణంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రోడ్లపై గల మురుగు కాలువలు దెబ్బతిని మురుగు నీరు రోడ్ల పైకి వస్తున్నందున మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఆదేశాల మేరకు మురుగు కాలువల నిర్మాణానికి కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, మహేశ్‌, సత్యం, విభూతినారాయణ, నాగన్నయాదవ్‌, వెంకటేశ్‌, భాష్యనాయక్‌, రాధాకృష్ణ, సమద్‌, ఉన్నీసాబేగం, రాధ, మంజుల, భువనేశ్వరి, జయసుధ, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు.