గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jul 24, 2020 , 03:15:53

నేటినుంచి శ్రావణమాస పూజలు

నేటినుంచి శ్రావణమాస పూజలు

నారాయణపేట టౌన్‌: మండలంలోని లోకాయపల్లిలో శ్రావణమాస పూజలు నేటినుంచి ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌-19 కారణంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దర్శనం కోసం వచ్చే భక్తులకు కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కల్పించనున్నారు. భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకొనే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ పూజారి సోమశేఖరస్వామి స్వగృహం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని కారులో ఎక్లాస్‌పూర్‌లోని ఆంజనేయస్వామి గుడి వద్దకు తీసుకెళ్లారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకీసేవ నిర్వహించి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఎంపీటీసీ చిన్నరాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, ఊశప్ప, చంద్రశేఖర్‌గౌడ్‌, నర్సప్ప, రాంరెడ్డి, గ్రామ యువకులు పాల్గొన్నారు.