గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 20, 2020 , 04:21:13

చందాపూర్‌ మెరవాలి

చందాపూర్‌ మెరవాలి

  • అభివృద్ధిలో భాగస్వాములుకండి
  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • చందాపూర్‌ గ్రామ పంచాయతీ ఆకస్మికంగా తనిఖీ 
  • బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌  చెక్కుల పంపిణీ

 ‘చందాపూర్‌ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మెరవాలి.. ఇందుకోసం గ్రామస్తులందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’.. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, గ్రామం సుందరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.  జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న క్యాంప్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆయన ఆదేశించారు. 

 వనపర్తి రూరల్‌: గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, చందాపూర్‌లో మినీ పార్కుకు స్థలం కేటాయించి సుందరంగా తీర్చిదిద్దాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చందాపూర్‌ గ్రామ పంచాయతీని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాలుగా నిధులు అందిస్తుందన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వీధులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొనేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్‌, క్రిమిటోరియం పనులు ఎంత వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించేందుకు సిఫార్సు చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామానికి వచ్చే సాగునీటి కాల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్‌ చెన్నారెడ్డి, గ్రామ నాయకులు, మల్లయ్య, మండ్ల కురుమూర్తి, పెంటయ్య, మహేందర్‌, పెంటయ్య, కిష్టయ్య, రంజిత్‌ కుమార్‌, సింహయ్య, వెంకటేశ్‌, శ్యాంలాల్‌యాదవ్‌ పాల్గొన్నారు.

బాధితులకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ 

వనపర్తి: అనారోగ్యం బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారిలో వనపర్తికి చెందిన రేణుక రూ. 60వేలు, రవికుమార్‌ రూ.5వేలు, మంజుల రూ.50వేలు, మౌనిక రూ.60వేలు, నరసింహ రూ.60వేలు, సతీష్‌కుమార్‌ రూ.60వేలు, సౌజన్య రూ.60వేలు, అబ్దుల్‌ నయూమ్‌ రూ.60వేలు, లోకేశ్వరి రూ. 21500, వెంకటేశ్వర్లు రూ.14,500,  మణెమ్మ రూ.16వేలు, దత్తాయపల్లికి చెందిన నరేశ్‌ రూ.21,500, జయన్న తిరుమలాపురానికి చెందిన శివ శంకర్‌ రూ.11వేలు, పెద్దమందడికి చెందిన శభాన్‌బేగం రూ.97,500, ఖిల్లా ఘణపురానికి చెందిన బాలరాజు రూ. 42,500, రాంపురానికి చెందిన బాలయ్య రూ.39,500, రంగాపురానికి చెందిన భీముడు రూ.20,500, కొత్తకోటకు చెందిన సంధ్యారాణి రూ.60వేలు, గోపన్‌పేటకు చెందిన జమ్ములమ్మ రూ. 22,500, బొల్లారానికి చెందిన భాగ్యమ్మ రూ.60వేలు, చిట్యాల తండాకు చెందిన పర్వతమ్మ రూ.45వేలు, రేవల్లికి చెందిన సుదర్శన్‌రెడ్డి రూ. 36,500 విలువ గల చెక్కులను మంత్రి బాధితులకు అందజేశారు.  

క్యాంపు కార్యాలయ పనులను  వేగవంతం చేయాలి

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం అధికారులు,  స్థానిక నాయకులతో కలిసి ఆయన క్యాంపు కార్యాలయ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ తదితర నాయకులు ఉన్నారు.