మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 19, 2020 , 03:54:42

మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వరం

మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వరం

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 

వనపర్తి: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి సీఎం కేసీఆర్‌ నాంది పలకడం విద్యార్థులకు వరమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠశాల వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడంతో పాటు మధ్యాహ్న భోజన వ్యవస్థను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు కూడా పెరగడంతో పాటు పాఠశాలలపై ఆదరణ పెరగిందన్నారు.

సమైక్య రాష్ట్రంలో హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయని..నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పరిస్థితులను చూశామన్నారు. స్వరాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం దిశగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గడిచిన ఆరేండ్లలో 550కి పైగా గురుకులాలను ఏర్పాటు చేయగా, 60 ఏండ్లలో కేవలం280 గురుకులాలలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిస్తున్నామని, బాలికలకు హెల్త్‌ కిట్లు, మధ్యాహ్న భోజనం, గురుకులాలలు, సన్నబియ్యం వంటివి ప్రభుత్వం అమలు చేయడం విద్యార్థులపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు.