గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jul 19, 2020 , 03:33:46

శాలువాపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలు

శాలువాపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలు

  • ఆవిష్కరించిన కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి: కొత్తకోట చేనేత కార్మికుడు జాలి కృష్ణయ్య సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ బొమ్మలతో కూడిన శాలువాను తయారు చేసి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా చేతులమీదుగా శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాలి కృష్ణయ్య 10రోజుల పాటు సిల్క్‌ శాలువాను తన మగ్గంపై నేశాడన్నారు. దీని విలువ రూ.15వేలు ఉంటుందని, ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు కోసం ప్రతిపాదించేందుకోసం తయారు చేసినట్లు చెప్పాడని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో జౌళిశాఖ అభివృద్ధి అధికారి తదితరులు ఉన్నారు.