వరంగల్ రూరల్ :మోడల్ స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన జిల్లాలోని సంగెo మండలం షాపురం శివారులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన గోరంట్ల వినోద్ కుమార్(45) మహబూబాద్ జిల్లా నెల్లికుదురులోని మోడల్ స్కూల్ లో పీజీటీ ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు.
కాగా, ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 12న స్కూల్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన వినోద్ తిరిగి ఇంటికి చేరుకోలేదు.
కాగా ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని శవం కొట్టుకో రావడంతో పోలీసులు దానిని బయటకు తీసి వినోద్ కుమార్ దిగా గుర్తించారు.
మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్‌కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు