మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jul 17, 2020 , 04:09:47

జిల్లాలో ‘ముసురు’

జిల్లాలో ‘ముసురు’

వనపర్తి : జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ముసురు వర్షం పడుతున్నది. జిల్లా కేంద్రం మొత్తం వర్షంతో తడి సి ముద్దయింది. దీంతో ప్రధాన రహదారులన్నీ వర్షం నీటితో నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 46.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షపాతం గరిష్టంగా 46.9 మిల్లీమీటర్లు వనపర్తిలో కనిష్టంగా 13 మిల్లీమీటర్లు పాన్‌గల్‌లో నమోదు అయింది. 

వర్షపాత నమోదు వివరాలు ఇలా.. 

వనపర్తి మండలంలో 46.9 వర్షపాతం నమోదుకాగా అమరచింత మండలంలో 20.3, మదనాపురం మం డలంలో 27.3, పెద్దమందడి మండలంలో 46.4, ఖిల్లాఘణపురం మండలంలో 29.1, గోపాల్‌పేట మండలంలో 38.8, రేవల్లి మండలంలో 16.0, పాన్‌గల్‌ మండలంలో 13.0, కొత్తకోట మండలంలో 28. 5, ఆత్మకూర్‌ మండలంలో 42.3, పెబ్బేర్‌ మండలం లో 17.9, శ్రీరంగాపురం మండలంలో 17.2, వీపనగండ్ల మండలంలో 14.4, చిన్నంబావి                13.5 వర్షపాతం నమోదు అయింది.