ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 14, 2020 , 06:59:41

దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

వనపర్తి టౌన్‌ : ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో, పార్స ల్‌ సర్వీస్‌లకు జిల్లాలోని మండల, గ్రామ స్థాయిల్లో ఏజెంట్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిపో సహాయ మేనేజర్‌ చంద్రమౌళి సోమవారం తెలిపారు. జిల్లాలోని ఖిల్లాఘణపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి, పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబావి, శ్రీరంగాపురం, మదనాపురం మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో కార్గో ఏజెన్సీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ, మండలస్థాయిలో రూ.1000 డిపాజిట్‌ ఉంటుందని, అర్హులైన అభ్యర్థులు వనపర్తి డిపోలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

బీసీ కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు

వనపర్తి రూరల్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రవేశాల కు గడువును పెంచినట్లు జిల్లా కన్వీనర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల బాలికలు ఇంగ్లీ ష్‌ మీడియం జూనియర్‌, డిగ్రీ కళాశాలల మొదటి సంవత్స రం ప్రవేశం కోసం ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తులను mjptbcwreis.telangana.gov.in / mjptbecwreis. cgg.gov.in ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు ఈ అకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతుబంధుకు గడువు పెంపు

వనపర్తి రూరల్‌/పెద్దమందడి/ఖిల్లాఘణపురం : రైతుబంధుకు అర్హులైనా మండలంలో దరఖాస్తు చేసుకోని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ రైతుబంధు దరఖాస్తుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పెంచినట్లు వనపర్తి మండల వ్యవసాయశాఖ అధికారి కురుమయ్య, పెద్దమందడి వ్యవసాయ అధికారి మల్లయ్య, ఖిల్లాఘణపురం వ్యవసాయ అధికారి రఘురాం సోమవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకొని రైతులు, జూన్‌ 16, 2020 వరకు కొత్త పట్టాదారు పుస్తకాలు వచ్చిన రైతులకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు వారు పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఆయా మండల వ్యవసాయ కార్యాలయంలో ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.