మంగళవారం 11 ఆగస్టు 2020
Wanaparthy - Jul 13, 2020 , 02:14:59

నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

  • మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌

వనపర్తి : మున్సిపాలిటీలో నిర్ధేశించిన హరితహారం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాద వ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాతకోటలో స్థానిక కౌన్సిలర్‌ పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడిన తరువాత వనపర్తి మున్సిపాలిటీకి కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా నిర్దేశించిన లక్ష్యాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూర్తి చేస్తామన్నారు. స్వరాష్ట్ర పాలనలో రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారివారి వార్డుల్లో ప్రతి ఇంటి ముందు ఒక మొక్క ను నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో వార్డు ప్రజలను భాగస్వాములుగా చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పాన్‌గల్‌ : మొక్కలు విరివిరిగా నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని సర్పంచ్‌ అనిత, ఎంపీటీసీ సుబ్బయ్యలు అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని శాగాపూర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రై వేట్‌ స్థలాల్లో మొక్కలు నాటించాలని సూచించారు. కార్యక్రమం లో నాయకులు తిరుపతయ్య, సుధాకర్‌యాదవ్‌ పాల్గొన్నారు.logo