శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jul 13, 2020 , 02:01:34

రేపటి నుంచి స్వచ్ఛంద బంద్‌కు పిలుపు

రేపటి నుంచి స్వచ్ఛంద బంద్‌కు పిలుపు

వనపర్తి : వనపర్తి పట్టణంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పలు నిబంధనలతో కూడిన స్వచ్ఛంద బంద్‌ పిలుపు ప్రకటిస్తున్నట్లు మెగా ట్రేడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రజల సౌకర్యా ర్థం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపా ర సముదాయాలు తెరిచి ఉంచేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటన ద్వారా వివరించారు. 

2 గంటల వరకే మెడికల్‌ షాపులు

వనపర్తి వైద్యం : జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ఆదివారం నుంచి మెడికల్‌ దుకాణాలను కొంత సమయం మేరకు మా త్రమే తెరుస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం నుం చి మెడికల్‌ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందన మెడికల్‌ షాపు లు ఈనెల 31వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచిఉంటాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.