శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:38:16

‘దాడి చేసిన దుండగులను శిక్షించాలి’

‘దాడి చేసిన దుండగులను శిక్షించాలి’

వనపర్తి టౌన్‌/మదనాపురం : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజగృహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్‌ చేయాలని ఎంఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి, తెలుగునాడు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి వారు నిరసన చేపట్టారు. మదనాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట అంబేద్కర్‌ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముంబైలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గృహంపై దాడికి పాల్పడిన దుండగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రాము మాదిగ, రాజేశ్‌, శివ, నారాయణ, శ్యాం, చెంద్రాయుడు, అశోక్‌, వేణు, గట్టన్న, మహేశ్‌, కురుమూర్తి, బుచ్చన్న, నరేందర్‌, వెంకటేశ్‌, శివరాం, గ్రామస్తులు పాల్గొన్నారు.