ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:37:36

మంత్రికి ధన్యవాదాలు

మంత్రికి ధన్యవాదాలు

వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఇటీవల లేఖ రాశారని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ తెలిపారు. అందుకు స్పందించిన మంత్రి కేటీఆర్‌ భర్తీలు పూరించడానికి మద్దతు తెలుపుతూ సంతకం చేశారని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

నేడు ఎమ్మెల్యే ఆల రాక

మదనాపురం : మండలంలోని కొన్నూరు గ్రామంలో రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన, సరళాసాగర్‌ ప్రాజెక్టు పరిశీలనకోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం మండలానికి వస్తున్నట్లు రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ హనుమాన్‌రావు, జెడ్పీటీసీ కృష్ణయ్య శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రతిఒక్కరూ ముఖానికి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.