గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:35:09

ఊట్కూరులో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం

ఊట్కూరులో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం

ఊట్కూర్‌: రైతుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. వారం, పది రోజులుగా విత్తనాలు విత్తేందుకు వరుణుడి కోసం అన్నదాతలు ఎదురుచూస్తుండగా శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. జిల్లా అంతటా దాదాపు వానకురిసింది. దీంతో పంటలకు ప్రాణం వచ్చింది. ఊట్కూరు మండలంలో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షంతో ఊట్కూరు పెద్ద చెరువుకు పైపాటు నుంచి వరద నీరు వచ్చి చేరింది. చెరువులు, కుంటల్లో వర్షపు నీరు చేరడంతో బోరు బావుల్లో నీటి మట్టం పెరుగనుంది. వానకాలం సీజన్‌ ప్రారంభంలో కొంత వర్షం పడటంతో కొందరు విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి, కంది, పత్తి, ఆముదం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.