శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:34:08

ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు

ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు

నారాయణపేట రూరల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇటీవల ప్రారంభమైన కార్గో పార్శిల్‌, కొరియర్‌ సర్వీసుల్లో వివిధ కేంద్రాల నుంచి సరుకు రవాణా చేయుటకు ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన్నట్లు డీఎం సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. పేట డిపో పరిధిలో కోస్గి, మద్దూర్‌, దామర్‌గిద్ద, మక్తల్‌, ఊట్కూర్‌, మాగనూర్‌, కృష్ణ, నర్వ, ధన్వాడ, మరికల్‌ మండల కేంద్రాల్లో ఏజెంట్ల నియామకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పార్శిల్‌ బుకింగ్‌ చేసిన అమౌంట్‌ నుంచి 12శాతం ఏజెంట్‌ కమీషన్‌ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సోమవారం సాయంత్రంలోగా దరఖాస్తులను డీఎం కార్యాలయంలో అందజేయ్యాలన్నారు. వివరాల కోసం మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాము (9951865459)ని సంప్రదించాలని సూచించారు.