శుక్రవారం 07 ఆగస్టు 2020
Wanaparthy - Jul 07, 2020 , 04:01:07

క‌రోనా క‌ట్ట‌డికి మేముసైతం

క‌రోనా క‌ట్ట‌డికి మేముసైతం

  • వనపర్తి, కొత్తకోటలో 20వ తేదీ వరకు బంగారు దుకాణాలు బంద్‌
  • స్వచ్ఛందంగా ముందుకొచ్చిన బులియన్‌ మర్చంట్‌ వ్యాపారులు
  • 10 నుంచి 25 వరకు టీ, టిఫిన్‌ సెంటర్లు

“కరోనా కట్టడికి వనపర్తి జిల్లా కేంద్రంలో, కొత్తకోటలో సోమ వారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పలు వ్యాపార సంస్థలు వారి సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపు నిచ్చాయి. ప్రజలు సహకరిం చాలని కోరుతున్నారు..”

వనపర్తి: కరోనా నిర్మూళనకు పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. అయినప్పటికీ రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ్రీన్‌ జిల్లాగా ఉన్న వనపర్తిలో కరోనా ఉనికి చాటుతున్నది. కేసులు పెరగడంతో వ్యాపార సంస్థలు గత నెల 15వ తేదీన మెగా ట్రేడ్‌ యూనియన్‌గా ఏర్పాటయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు షాపులు తెరిచి ఉంచకుండా సాయంత్రం 4గంటల వరకే మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే బంగారం దుకాణాల యజమానులు మరో అడుగు ముందుకేశారు. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు స్వచ్ఛందంగా జిల్లా కేంద్రంలో వ్యాపార సముదాయాలను మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు సహకరించాలని సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. నిత్యం రద్దీగా ఉండే శంకర్‌గంజ్‌ నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. అదేవిధంగా ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు టీ, టిఫిన్‌ సెంటర్లు బంద్‌ చేయనున్నట్లు టీ, టిఫిన్‌ సెంటర్ల సంఘం సభ్యులు తెలిపారు. ప్రజలందరూ సహకరించి వనపర్తి గ్రీన్‌ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. 

కొత్తకోటలో స్వచ్ఛందంగా బంద్‌

కొత్తకోట: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కొత్తకోట పట్టణంలో కూడా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో బులియన్‌ మర్చంట్‌ అండ్‌ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 20వరకు స్వచ్ఛందంగా బంద్‌ ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజలు  బంద్‌కు సహకరించాలని కోరారు. logo