శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jun 26, 2020 , 03:05:36

వనపర్తి లో రెండు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ ..

వనపర్తి లో రెండు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ ..

వనపర్తి వైద్యం : జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌లో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గురువారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఒకరు ఎస్‌బీఐ బ్యాంక్‌ ఉద్యోగి కాగా మరొకరు ప్రైవేట్‌ దవాఖాన డాక్టర్‌ డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చినట్లు  తెలిపారు. బ్యాంక్‌ ఉద్యోగికి సంబంధించిన పది మంది ఉద్యోగులను, డ్రైవర్‌కు సంబంధించిన 9మంది కు టుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు  చెప్పారు.