శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jun 24, 2020 , 03:17:45

విద్యను ఇష్టంతో అభ్యసించాలి

విద్యను ఇష్టంతో అభ్యసించాలి

వనపర్తి : ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ర్యాంకులు సాధించడం సులభతరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌, పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వేర్వేరుగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే విద్యార్థులు విద్యపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్ష్మయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్‌ నందిమల్ల భువనేశ్వరి, నాయకులు నందిమల్ల శ్యాంకుమార్‌, తోట శ్రీను, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధ ర్‌, మధుసూదన్‌గుప్తా, యాజమాన్య సభ్యులు జగదీశ్వర్‌, వరప్రసాద్‌రావు, నాగేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.