మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 07:15:47

సప్తవర్ణాలతో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌

సప్తవర్ణాలతో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌

  • ముగిసిన సూర్యగ్రహణం
  • సోలార్‌ ఫిల్టర్‌తో వీక్షించిన ప్రజలు
  • సంప్రోక్షణ తర్వాత తెరుచుకున్న ఆలయాలు  

మహబూబ్‌నగర్‌ : ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆదివారం సప్తవర్ణాల తో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా ఏర్పడింది. సూ ర్యుడు పాక్షిక్షంగా కనిపించాడు. ఉద యం 10:59 గంటల నుంచి మధ్యా హ్నం 1:59 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడింది. అద్భుత దృశ్యాన్ని వృద్ధులు, యువత, చిన్న పిల్లలు సోలార్‌ ఫిల్టర్‌తో వీక్షించారు. అయితే ఆకాశం మే ఘావృతమై ఉండటంతో పూర్తి స్థాయిలో కనిపించలేదు. గ్రహణం సమయంలో పల్లె ప్రజలు పాత్రల్లో నీళ్లు పోసి అందు లో రోకలి బండను నిలబెడుతుంటారు.  గ్రహణం ముగిశాక ప్రజలు తమ ఇండ్ల ను శుభ్రం చేసుకొని ఇంటిల్లిపాది స్నానా లు చేసి పూజలు చేశారు. ఆలయాలు ఉదయం నుంచే మూసివేసి సాయం త్రం 4 గంటల తర్వాత సంప్రోక్షణ చేసి తెరిచారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమి టీ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌ టీచర్స్‌ కాలనీలో సోలార్‌ ఫిల్టర్‌ సాయంతో సూర్యగ్రహణ వీక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, కోశాధికారి ప్రమోద్‌కుమార్‌లు సోలాల్‌ ఫిల్టార్‌ సాయంతో స్థానికులకు గ్రహణాన్ని వీక్షింప జేశారు. ఆకాశం మబ్బు పట్టి ఉండడంతో  వీక్షణకు చాలా సమయం పట్టింది.

శ్రీశైలంలో నేటి నుంచి దర్శనాలు

   శ్రీశైలం  : శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో సూర్యగ్రహణం అనంతరం ఆదివారం సాయంత్రం మంగళవాయిద్యాలతో ఆలయ ద్వారాలు తెరిచినట్లు ఆల య కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. అర్చకులు, వేదపండితులతో ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామికి సుప్రభాత సేవ, మహా మంగళహారతులను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వా మి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. సో మవారం ఉదయం 6:30 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న వారికి టైమ్‌స్లాట్‌ ప్రకారం దర్శనాలు, పరోక్ష సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. 

ఉమామహేశ్వరంలో పూజలు

 అచ్చంపేట రూరల్‌ : శ్రీశైల ఉత్తర ధ్వారమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో పూజలు పునఃప్రారంభమయ్యాయి. ఆదివారం సూర్య గ్రహణం సందర్భంగా ఉదయం దేవాలయాన్ని మూసేసి మ ధ్యాహ్నం 2:30 గంటలకు తెరిచి ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం 3 గంటల నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్‌ సుధాకర్‌, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో లోక కల్యాణార్థం చండీయాగం నిర్వహించారు. కరోనా వైరస్‌ వెంటనే క్షీణించి పోవాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఆలయాల్లో సంప్రోక్షణ

  అలంపూర్‌ : సూర్య గ్రహణం కారణంగా దక్షిణ కాశీ అలంపూర్‌లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి  ఆలయాలు ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం మూసివేశారు. గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం తర్వాత అర్చకులు, ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేసి చేసి సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి, స్వామికి సంధ్యావేళ మహా మంగళహారతి సమర్పించారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు భక్తులకు ఆలయ దర్శనం సౌకర్యం కల్పించలేదని ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.