మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 02:15:01

మార్గనిర్ధేశకుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌

మార్గనిర్ధేశకుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌

 మహబూబ్‌నగర్‌ టౌన్‌ : తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో  చెరగని ముద్ర వేసుకున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ భవిష్యత్‌ తరాలకు మార్గ నిర్ధేశకులని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ని తన నివాసంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని అన్నారు. సార్‌ స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని ఆయన పిలుపు నిచ్చారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పది గంటలకు పది నిమిషాల పిలుపు మేరకు తన నివాసంలో పూలకుండీలు, స్టోర్‌రూం, వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాలను మంత్రి స్వయంగా శుభ్రం చేశారు. డెంగీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ  వారి ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.