గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 02:12:44

తెలంగాణకే అంకితం ఆచార్య జయశంకర్‌ జీవితం

తెలంగాణకే అంకితం ఆచార్య జయశంకర్‌ జీవితం

  • 60 ఏండ్లపాటు తెలంగాణను జాగృతం చేసిన మేధావి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 
  • వనపర్తి : ఆచార్య జయశంకర్‌ జీవితం తెలంగాణకే అంకితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలకుల దోపిడీని తెలంగాణ ప్రజలకు తెలియజేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్‌ అన్నారు. ఆయన ఆకాంక్షల మేరకు తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌,  వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్లు చీర్ల సత్యం, నాగన్న యాదవ్‌, జంపన్న, కాగితాల లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.