మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 15, 2020 , 02:08:52

ఒకే కాన్పులో ముగ్గురు

ఒకే కాన్పులో ముగ్గురు

నారాయణపేట:  నారాయణపేట జిల్లా దవాఖానలో ఆదివారం ఉదయం ఓ మహిళకు ప్రసవం జరుగగా ముగ్గురు పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పరిమళపురానికి చెందిన రాజలింగం జిల్లా దవాఖానలో వార్డుబాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య అనంతమ్మకు నొప్పులు రావడంతో ప్రసవం కోసం దవాఖానలో చేర్పించాడు. సాధారణ ప్రసవం జరుగగా ఒకే సారి ముగ్గురు పిల్లలు జన్మించారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.