గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 14, 2020 , 02:37:24

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

వనపర్తి/ఆత్మకూరు/పెబ్బేరు : వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సీజనల్‌ వ్యాధులపై   జాగ్రత్తగా ఉండాలని అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లను రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లు, వైస్‌ చైర్మన్లతో సీజనల్‌ వ్యా ధులు, శానిటేషన్‌, హరితహారం తదితర అంశాలపై వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షపు నీటితో లార్వా అభివృద్ధి చెంది దో మలు పెరుగుతాయని, దీని ద్వారా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని, ఈ విష యంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతా ల్లో నీరు నిల్వ ఉండకుండా చర్య లు తీసుకోవాలని ఆ యన మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. అంతేకాక మున్సిపాలిటీలలో ఉండే పెద్ద పెద్ద నాలాలలో ఎప్పటికప్పుడు ఒండ్రు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడు తూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పెద్ద నాలాలో ఒం డ్రు మట్టిని ఎప్పటికప్పుడు తీయిస్తున్నామని, మిగిలిన ఒండ్రు మట్టిని రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన మంత్రికి వివరించారు. హరితహారం కింద ము న్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు చర్య లు తీసుకుంటున్నామని, ఇందుకు గానూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు.

జిల్లాలోని వనపర్తి, పెబ్బేర్‌, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచిం త మున్సిపాలిటీల్లో 48 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించామని అదనపు కలెక్టర్‌ తెలిపారు. వీధి వ్యాపారుల విషయమై జిల్లాలోని అన్ని ము న్సిపాలిటీల్లో చిరువ్యాపారులను గుర్తించడమే కాకుండా వారికి సర్టిఫికెట్లు కూడా ఇచ్చామని, వారి వివరాలన్నింటిని అప్‌లోడ్‌ చేయడం జరిగిందని ఆయన వివరించా రు. అనంతరం వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ఆదేశాలను విధిగా పాటిస్తున్నామని, ముఖ్యంగా ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని వనపర్తి మున్సిపాలిటీలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రియాదవ్‌, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, తాసిల్దార్‌ జేకే మోహన్‌, అమరచింత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మగౌడ్‌, వైస్‌చైర్మన్‌ జీఎస్‌ గోపి, పెబ్బేరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, కమిషనర్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.