గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jun 14, 2020 , 01:49:28

వనపర్తిలో 9001 మంది రైతుబంధు సాయానికి దరఖాస్తు

వనపర్తిలో 9001 మంది రైతుబంధు సాయానికి దరఖాస్తు

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా 1,47,182 మంది రైతులు ఉండాగా వీరందరికీ రైతుబంధు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వీరిలో 1,123 మంది రైతులు మృతి చెందినట్లు గుర్తించింది. మిగిలిన 1,46,059 మంది రైతుల్లో 1,30,894 మంది అర్హులు కాగా.. వీరిలో 9001 మంది శనివారం రైతుబంధు సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన రైతులు అధికారులకు అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేదు.