సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jun 10, 2020 , 05:46:22

దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

దేవరకద్ర నియోజకవర్గ  అభివృద్ధికి నిధులివ్వండి

  •   మంత్రులను కోరిన ఎమ్మెల్యే ఆల 

మూసాపేట : దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు ఇప్పటికే మ ంజూరైన పనులకు వెంటనే టెండ ర్లు పిలవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి  కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎ మ్మెల్యే ఆల కలిశారు. భూత్పూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.10 కోట్ల పనులకు, కొత్తకోట మున్సిపాలిటీలో రూ.15 కోట్ల పనులకు సంబంధించి టెం డర్లు పిలవాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మూసాపేట, మదనాపూర్‌ మండల సముదాయ భవనాల నిర్మాణాలకు రూ.కోటి చొప్పున,  కోత్తకోట మండలం పాత జంగమాయపల్లి వంతెన నిర్మాణానికి రూ.12.13 కోట్లను మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. హౌసింగ్‌శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి చిన్నచింతకుంట మండలంలో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన కాజ్వే నిర్మాణానికి టెండర్లు పిలవాలని, నియోజకవర్గానికి అదనంగా 500 డబుల్‌బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిసి భూత్పూర్‌లో అధునాతమైన చేపల మార్కెట్‌ ఏర్పాటుకు, దేవరకద్రలో వెటర్నరీ క్లీనిక్‌ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.