శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Jun 09, 2020 , 07:02:16

రాజపేటలో గొర్రె పిల్లల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం

 రాజపేటలో గొర్రె పిల్లల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి : మండల సమీపంలోని రాజపేట శివారులో గొర్రె పిల్లల పరిశోధన, ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు 21 ఎకరాలు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌, సభ్యులకు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 

కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత 

పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తను ఎళ్లవేళలా కాపాడుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దగూడెంతండాకు చెందిన నేనావత్‌ బాలయ్య నాయక్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ కీలక సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ నుంచి విడుదలైన చెక్కును వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బాధిత కుటుంబానికి అందజేశారు.