గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jun 07, 2020 , 02:58:12

పారిశుధ్య కార్యక్రమం కొనసాగించాలి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

పారిశుధ్య కార్యక్రమం కొనసాగించాలి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి రూరల్‌ : ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా మండల అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో పారిశుధ్యం, హరితహారంపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై ప్రభుత్వం జారీ చేసిన 182 జీవోను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై గ్రామాలను ఏ,బీ,సీ, కేటగిరిలుగా విభజించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం బాధ్యత ఎంపీడీవోలు, ఏపీవోలదేనని, ప్రత్యేకించి ఎంపీవోలు గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. హరితహారం నర్సరీలు ఇంకా గ్రేడింగ్‌ చేయనటైతే వెంటనే చేయాలని, బ్యాగ్‌ ఫిల్లింగ్‌, బ్యాగులలో విత్తనాలు వేయడం, గుంతల తవ్వకం, మొక్క ల కేటగిరి, ఏ మొక్కలు ఎక్కడ నాటాలో సూక్ష్మస్థాయి ప్రణాళిక తయారు చేసి తక్షణం సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో రాజేశ్వరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు, డీఆర్డీవో గణేశ్‌ పాల్గొన్నారు.