మంగళవారం 07 జూలై 2020
Wanaparthy - May 25, 2020 , 02:36:29

రైతు ఎదుగుదలే మన ధ్యేయం

రైతు ఎదుగుదలే మన ధ్యేయం

అందరం శాయశక్తులా కృషి చేద్దాం

రైతుబంధు సమావేశాలు పకడ్బందీగా జరగాలి

నూతన వ్యవసాయ విధానం సక్సెస్‌ చేయాలి

ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రైతుల ఎదుగుదలే ధ్యేయంగా అందరం శాయశక్తులా కృషి చేద్దామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జెడ్పీటీసీలు, రైతుబంధు సభ్యులు, మండల స్థాయి ప్రత్యేకాధి కారులతో వానకాలం నూతన వ్యవసాయ విధానంపై మంత్రి మాట్లాడారు. నూతన వ్యవసాయ విధానాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం రైతుబంధు సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.  

మహబూబ్‌నగర్‌ : రైతు ఎదుగుదలే మన ధ్యేయంగా పనిచేద్దామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలోని జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జెడ్పీటీసీలు, రైతుబంధు సభ్యులు, మండల ప్రత్యేక అధికారులు దాదాపు 562 మందితో వానకాలం కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై మంత్రి శ్రీనివాస్‌గౌ డ్‌ మాట్లాడారు. క్లస్టర్ల వారీగా పూర్తి కాగానే గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. కొంతమంది రైతులు బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేయకపోవడంతో రుణమా ఫీ జమకావడం లేదని, రైతుబంధు అధ్యక్షులు తక్షణమే వివరాలను సేకరించి జిల్లా స్థాయికి నివేదించాలని పేర్కొన్నారు. రై తుబంధు డబ్బులు 100 శాతం జమ కావాలని చెప్పారు. ఖా ళీగా ఉన్న వ్యవసాయ అధికారుల పోస్టులను రెండు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వెయ్యి ఎకరాల్లో అగ్రికల్చర్‌ సెజ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇం దుకు సంబంధించి మహబూబ్‌నగర్‌, పేట జిల్లాలో భూములు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 20 ఎకరాల్లో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రతి క్లస్టర్‌లో రైతువేదిక నిర్మిస్తామన్నారు. 

  • జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆ ర్‌ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి రైతులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. సాంకేతిక నిపుణుల సలహా లు, సూచనలను రైతులకు అందించి, సర్పంచ్‌ మొదలుకొని జిల్లా స్థాయి వరకు అందరూ పాల్గొనేలా చూడాలన్నారు.
  • దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ విధానం ఒక మంచి కార్యక్రమన్నారు. ఇ ప్పటి నుంచే ఎరువులను తీసుకెళ్లేలా రైతులకు సమాచారం ఇ వ్వాలని సూచించారు. తాసిల్దార్‌, వ్యవసాయ అధికారి సమన్వయంతో గ్రామాల వారీగా రైతుబంధు డబ్బులు జమకాని వారి వివరాలు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. ప్రతి గ్రా మంలో కొంత మంది రైతులను కూరగాయల సాగుకు ప్రోత్సహించాలని చెప్పారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలకు అ భ్యుదయ రైతులను పిలిపించి వారి సలహాలు, సూచనలు కూ డా తీసుకోవాలన్నారు.
  • నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న రైతుబంధు సభ్యులందరినీ పిలిపించి నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. 
  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ వానకాలం వ్యవసాయ సాగుపై గండీడ్‌ మండలంలో అవగాహన సదస్సు ప్రారంభించామన్నారు. మూడ్రోజుల్లో సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. గండీడ్‌లో మూడు వేల ఎకరాల మొక్కజొన్న రైతు లు ఉన్నారని, వారిని కంది పంటకు ప్రోత్సహిస్తున్నామన్నారు. 
  • మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్‌రావు మాట్లాడుతూ జిల్లాలో రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్నవారు 6,800 మంది ఉన్నారని, ఇప్పటివరకు 5,500 మందికి డబ్బులు జ మఅయ్యాయన్నారు. మిగతా వారికి ఆధార్‌ అనుసంధానం కా నందున జమ కాలేదని, మూడ్రోజుల్లో అనుసంధానం చేసి డ బ్బులు జమచేస్తామని వివరించారు. గతేడాది అక్టోబర్‌ వరకు మాత్రమే భూ రికార్డుల ఇంటిగ్రేషన్‌ జరిగిందని, ఇంకా చేయాల్సిన ఖాతాలు 15 వేలు ఉన్నాయని, వారం రోజుల్లో మిషన్‌ మోడ్‌లో ఇవి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 88 రైతు వేదికలకు గాను 72 వేదికలకు స్థలా లు పరిశీలించామన్నారు. 
  • రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లాలోని రైతుబంధు ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.


logo