బుధవారం 03 జూన్ 2020
Wanaparthy - May 15, 2020 , 02:17:37

విధుల్లో ఉన్నవారికి మధ్యాహ్న భోజనం

విధుల్లో ఉన్నవారికి మధ్యాహ్న భోజనం

వనపర్తి వైద్యం/పాన్‌గల్‌ : లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పోలీస్‌, వైద్య సిబ్బంది, పారిశుధ్య, వలస కార్మికులకు గురువారం పాన్‌గల్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌ సింగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎస్సై తిరుపాజీలు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వనపర్తిలో ఆర్డీఎస్‌ సంస్థ, సఖీ కేంద్రం సంయుక్తంగా జిల్లా దవాఖానలో వైద్యులకు, రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాముడు, వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, విండో సీఈవో భాస్కర్‌గౌడ్‌, ఆర్డీఎస్‌ సంస్థ చైర్మన్‌ చిన్నమ్మథామస్‌, సఖీ కేంద్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo